అదరగొట్టిన జాం జాం జజ్జనక సాంగ్

భోళాశంకర్ నుండి జాం జాం జజ్జనక ఫుల్ సాంగ్ వచ్చేసింది. చిరంజీవి , తమన్నా, కీర్తి సురేష్ , సుశాంత్ ప్రధాన పాత్రల్లో మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని AK ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు. ఆగస్టు 11 న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. ఈ తరుణంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను స్పీడ్ చేసింది. మంగళవారం సినిమాలోని జాం జాం జజ్జనక ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేసి సినిమా ఫై అంచనాలు పెంచారు.

జామ్ జామ్ జజ్జనక.. అంటూ సాగే ఈ పాటలో మెగాస్టార్ మాస్ అండ్ స్టైలిష్ స్టెప్పులు హైలెట్ గా నిలువగా తమన్నా కూడా తన స్టెప్పులతో బాగానే ఆకట్టుకుంది. ఇక సినిమాలో మెగాస్టార్ కు సోదరి పాత్రలో నటించిన కీర్తి సురేష్ ఇక ఆమెకు జోడిగా సుశాంత్ కూడా ఈ సాంగ్ లో మాస్ స్టెప్పులు వేశారు. అనురాగ్ కులకర్ణి మంగ్లీ పాటను పాడగా కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించారు. మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు.

ఇక భోళా శంకర్ సినిమా తమిళ్ వేదళం సినిమాకు రీమేక్ అనే విషయం తెలిసిందే. ఇక ఒరిజినల్ కథకు తగ్గట్టుగా కాకుండా దర్శకుడు మెహర్ రమేష్ విభిన్నంగా తనదైన శైలిలో రూపొందించినట్లు తెలుస్తోంది. ఇక సినిమాలో మంచి యాక్షన్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారట. మరి చాల ఏళ్ల గ్యాప్ తర్వాత మెహర్ రమేష్ వస్తున్నాడు. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

YouTube video