‘బుల్లెట్‌ సత్యం’

లిరికల్‌ వీడియో సాంగ్‌ విడుదల

A Still From 'Bullet Sathyam- Movie
A Still From ‘Bullet Sathyam- Movie

సాయితేజ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై దేవరాజ్‌, సోనాక్షి వర్మ హీరో హీరోయిన్లుగా మదుగోపు దర్శకత్వంలో దేవరాజ్‌ నిర్మిస్తున్న చిత్రం ‘బుల్లెట్‌ సత్యం .

చిత్రం టైటిల్‌, లిరికల్‌ వీడియో సాంగ్‌ను హైదరాబాద్‌లోని ఫిల్మ్‌ఛాంబర్‌లో విడుదల చేశారు.. ఈ కార్యక్రమానికి నిర్మాత రాజ్‌ కందుకూరి, డైరెక్టర్‌ వీరశంకర్‌, దేవీ ప్రసాద్‌, సంజయ్ రెడ్డి లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేశారు.

టైటిల్‌ చాలా బాగుందని, ఈచిత్రం యూనిట్‌కు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నట్టు అతిథులు పేర్కొన్నారు.

రాజ్‌ కందుకూరి మాట్లాడుతూ, టైటిల్‌ చాలా క్యాచీగా ఉందని విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌ కథ అన్నారు. ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నారు.

కార్యక్రమంలో చిత్ర నిర్మాత, హీరో దేవరాజ్‌, హీరోయిన్‌ సోనాక్షివర్మ, సంగీత దర్శకుడు యాజమాన్య, లిరిక్‌ రైటర్‌ రాంబాబు గోశాల, డైరెక్టర ్‌మధు, చంద్రకిరణ్‌ తదితరులు మాట్లాడారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/