జేపీ నడ్డాను కలిసిన పవన్‌ కళ్యాణ్‌

Pawan Kalyan meeting with J P Nadda
Pawan Kalyan meeting with J P Nadda

న్యూఢిల్లీ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. పర్యటనలో భాగంగా ఇవాళ బిజెపి చీఫ్‌ జేపీ నడ్డాతో పవన్‌ భేటీ అయ్యారు. ఏపీలో ఇరుపార్టీల కార్యాచరణపై సమావేశంలో నిశితంగా చర్చిస్తున్నారు. సమావేశంలో జనసేన కీలకనేత నాదెండ్ల మనోహర్‌,
బిజెపి ఎంపీ జీవీఎల్, బిజెపి మహిళా నేత పురందేశ్వరి పాల్గొన్నారు. కాగా నడ్డాతో పవన్ భేటీ కావడం ఇది రెండోసారి. ఇవాళ భేటీ అనంతరం కో ఆర్డినేషన్ కమిటీ సభ్యులను రెండు పార్టీలు ప్రకటించనున్నాయని తెలుస్తోంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి తరలింపుతో పాటు అసెంబ్లీ, శాసనమండలిలో చోటు చేసుకున్న పరిణామాలను పవన్, ఏపీ బిజెపి నేతలు నడ్డా దృష్టికి తీసుకెళ్లనున్నారని తెలుస్తోంది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/