కొత్తరకం కరోనా వైరస్‌ పంజా

Corona virus

కొత్తరకం కరోనా వైరస్‌ పంజా విసురుతోంది.. చైనాలో వెలుగుచూసిన కరోనా వైరస్‌ దెబ్బకు మృతుల సంఖ్య 9కి చేరింది.. కాగా ఈ వైరస్‌ బాధితుల సంఖ్య440 చేరినట్టు ఆ దేశ ఆరోగ్యశాఖ ఉపమంత్రి లిన్‌ బిన్‌ తెలిపారు.. ఈ వైరస్‌ వేగంగా వ్యాపించనున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. అంతేకాకుండా పలు హెచ్చరికలు జారీచేశారు.. ఈ వైరస్‌ వేగంగా పరివర్తనం చెందుతూ ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే అవకాశం ఉందని వివరించారు.. ఈకాగా ఈ వైరస్‌ ఆసియాతోపాటు పశ్చిమ దేశాలకు వ్యాప్తిచెందినట్టు భావిస్తున్నామన్నారు. అమెరికాలో ఒక కేసు నమోదైనట్టు అక్కడి అధికార వర్గాలు ధృవీకరించాయి.. సీయాటెల్‌లో నివాసం ఉంటున్న 30సంవత్సరాల వ్యక్తి అధికారులను సంప్రదించారు.. అతను అనారోగ్యానికి గురికావటంతో వైద్యపరీక్షల్లో సార్స్‌ ఆనవాళ్లు గుర్తించినట్టు వైద్యులు తేల్చారు..ప్రస్తుతం ఆయన్ని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.. గతంలో చైనాలోని ఉహాన్‌ నగరానికి వెళ్లిన ఆయన ఈనెల 15న తిరిగి వచ్చినట్టు , ప్రస్తుతం ఆ వ్యక్తి ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు..

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com/