నేడు నంద్యాలలో జనసేన అధినేత పవన్​కల్యాణ్​ పర్యటన..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు ఆదివారం నంద్యాల లో పర్యటించబోతున్నారు. శిరివెళ్ల గ్రామంలో జరగనున్న రచ్చబండ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొని , కౌలు రైతుల కుటుంబాలకు చెక్కులు అందజేయనున్నారు. గత కొద్దీ రోజులుగా పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర పేరిట పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఆత్మ హత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి , వారికీ ఆర్ధిక సాయం అందజేస్తున్నారు. ఈ యాత్రలో భాగంగా ఈరోజు నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు.

కౌలు రైతు భరోసా యాత్ర కోసం ఉదయం 9 గంటలకు ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడినుంచి బయల్దేరి నంద్యాల జిల్లా శిరివెళ్ల గ్రామంలో జరగనున్న రచ్చబండ కార్యక్రమానికి బయల్దేరి వెళ్తారు. మార్గమధ్యలో.. ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతులకు చెందిన నాలుగు కుటుంబాలను పరామర్శించి.. వారికి సాయం డబ్బును చెక్కుల ద్వారా అందజేస్తారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు శిరివెళ్ల చేరుకుని.. రచ్చబండ కార్యక్రమంలో కౌలు రైతుల కుటుంబాలకు చెక్కులు అందజేసి సభలో ప్రసంగిస్తారు.