తొలి రోజు ఆట ముగిసే సరికి భారత్ స్కోరు 36/1

ఛటేశ్వర్ పుజారా 7 – శుభమన్ గిల్ 28 పరుగులతో క్రీజ్ లో ..

India 36/1
India 36/1

మెల్ బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ తొలి రోజు ఆట ముగిసే సరికి భారత్ తొలి ఇన్నింగ్స్ లో వికెట్ నష్టానికి 36 పరుగులు చేసింది. అంతకు ముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 195 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

భారత బౌలర్లలో బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ మూడు, విహారి రెండు వికెట్లు పడగొట్టగా, జడేజాకు ఒక వికెట్ దక్కింది.  ఆ తరువాత తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన బారత్ కు తొలి ఓవర్ లోనే ఎదురు దెబ్బ తగిలింది.

స్టార్స్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ చివరి బంతికి మయాంక్ అగర్వాల్ లెగ్ బిఫోర్ గా వెనుదిరిగాడు. స్కోరు బోర్డు మీద పరుగులేమీ లేకుండానే తొలి వికెట్ కోల్పోయిన భారత్ ఆట ముగిసే సరికి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడింది.

ఛటేశ్వర్ పుజారా 7 పరుగులతోనూ, తొలి టెస్ట్ ఆడుతున్న శుభమన్ గిల్ 28 పరుగులతోనూ క్రీజ్ లో ఉన్నారు.

తాజా ‘చెలి’ శీర్షికల కోసం : https://www.vaartha.com/specials/women/