శక్తిని పెంచే హోమియోపతి

ఆరోగ్యం -ఔషధాలు – వాడకం

Homeopathic medicine -immunity
Homeopathic medicine -immunity

వ్యాధి నిరోధకంగా హోమియో మందు వేసుకున్న వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహార పానీయాలు తీసుకోవటం కూడా అంతే ముఖ్యం. అందులో భాగంగా విటమిన్ సి సమృద్ధిగా లభించే బత్తాయి, కమలా పండ్లు తినాలి.. అల్లం రసం , నిమ్మ రసం తరచుగా తాగాలి.
కొత్త వైరస్ ఏదో వచ్చి ప్రాణాలు తీసేస్తోందని తెలిస్తే చాలు… అందరూ బెంబేలెత్తి పోతారు . కానీ, ప్రాణాంతక పరిస్థితి ఏర్పడటానికి వచ్చి పడిన వైరస్ కాదు.. మనుషుల్లో వ్యాధి నిరోధక శక్తి బాగా తగ్గిపోవటమే అసలు కారణం. ఆ శక్తిని పెంచుకునే విషయంలో చాలా మంది నిర్లక్ష్యంగా ఉంటారు.. ఆ మాటకొస్తే కలుషితమైన ఆహార పానీయాలు, వాతావరణ కాలుష్యం వ్యాధి నిరోధక శక్తి ని బాగా తగ్గిస్తాయి.. విదేశాల్లో అయితే సూర్య రశ్మి కూడా సరిగా లభ్యం కాక్ వ్యాధి నిరోధక శక్తి తగ్గి పోతుంది.. దాని పరిణామంగానే కొన్ని రకాల వైరస్ లతో వణికి పోయే పరిస్థితి ఏర్పడుతుంది…

ఇపుడు మానవాళిని భయాందోళనకు గురిచేస్తున్న కరోనా వైరస్ విషయంలో అదే జరుగుతోంది.. ఈ స్థితిలో ఎవరైనా చేయాల్సింది ఒక్కటే… వ్యాధి నిరోధక శక్తిని బాగా పెంచుకోవటం , కరోనా వైరస్ సోకినా వారిలో జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ప్రధానంగా కన్పిస్తాయి.. అయితే శ్వాస కోశానికి సంబంధించిన వ్యాధి సోకినా ఈ లక్షణాలే కన్పిస్తాయి..

అందువల్ల వ్యాధి నిర్ధారణ పరీక్షల ద్వారా వైరస్ ను గుర్తిస్తే తప్ప అది కారానాయే అని నిర్ధారణకు రావటం సాధ్యం కాదు.. వైరస్ సోకినా తర్వాత చికిత్సలు తీసుకోవటం అంటా వేరు.. అసలు సోకకుండా నిరోధించే ప్రయత్నం అన్నింటికన్నా ముఖ్యం… ఆ దృష్టిటోన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక హోమియో మందును ఆమోదించింది.. ఆర్సినిక్ ఆల్బ్ -30 అనే ఈ మందుని రోజుకు డోసు చొప్పున 3 రోజులు వరుసగా వేసుకోవాలి… ఆ తర్వాత వారం రోజులు ఆగి, మల్లె మూడు రోజులు వరుసగా వేసుకోవాలి.

‘నాడి’ (ఆరోగ్య సంబంధిత విషయాల కోసం) : https://www.vaartha.com/specials/health1/