నేడు మేడారంకు వెళ్లనున్న సిఎం, గవర్నర్‌

హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కూడా వన దేవతల్ని దర్శించుకోనున్నారు.

cm kcr-medaram
cm kcr-medaram

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ ఈరోజు ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌ ద్వారా మేడారం వెళ్లి సమ్మక్క, సారలమ్మ తల్లులను దర్శించుకుంటారు. రెండేళ్ల కిందట జరిగిన జాతరలో సమ్మక్కసారలమ్మ గద్దెల మీదకు చేరిన తర్వాతే సిఎం కెసిఆర్‌ వారిని దర్శించుకున్నారు. ఇప్పుడూ అదే సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఐతే తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా ఇవాళే మేడారం రాబోతున్నారు. సిఎం కెసిఆర్‌ కంటే గంట ముందే ఆమె వన దేవతల్ని దర్శించుకోనున్నారు. అలాగే ప్రస్తుతం తెలంగాణలో ఉన్న హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కూడా హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌ ద్వారా మేడారం చేరుకొని అమ్మవార్లకు మొక్కులు చెల్లిస్తారు. కాగా లక్షల మంది భక్తుల రాకతో భక్త జన సంద్రమైంది మేడారం. వనదేవతల్ని గద్దెలపై కొలువు దీర్చడంతో సమ్మక్క, సారలమ్మను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/