ఇన్‌స్టాగ్రామ్‌లో పవన్ పెట్టిన మొదటి పోస్ట్ అందరి ఫ్యాన్స్ ను కట్టిపడేసింది

సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రీసెంట్ గా ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఎలాంటి పోస్ట్ చేయకుండానే దాదాపు రెండు మిలియన్ల ఫాలోయర్స్ ఫాలో అవుతూ రికార్డు సృష్టించారు. పవన్ కళ్యాణ్ మొదటి పోస్ట్ దీనిపై పెడతారో..? ఎలాంటి పోస్ట్ పెడతారో..? ఎవరి గురించి పెడతారో..? అని యావత్ సినీ లోకం , పార్టీ కార్యకర్తలు , సినీ ప్రముఖులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మొదటి పోస్ట్ పెట్టి అందర్నీ కట్టిపడేసారు.

శనివారం సాయంత్రం (జూలై 15) పవన్ ఫస్ట్ టైం ఇన్‌స్టాలో ఓ స్టోరీ పోస్ట్ చేశారు. ఫస్ట్ పోస్టే కాస్త ఎమోషనల్‌గా చేశారు. ‘మన బంధం ఇలానే కొనసాగాలని, మరెన్నో మధురమైన జ్ఞాపకాల్ని పంచుకోవాలని ఆశిస్తూ…’ అంటూ మెమరబుల్ వీడియో ఒకటి షేర్ చేశారు. ఇందులో తన ఫ్యామిలీ మొదలుకుని, సినిమాలకు సంబంధించిన బ్యూటిఫుల్ పిక్స్ చాలా ఉన్నాయి. తన ఫస్ట్ ఫిలిం డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ మొదలుకుని, ఇప్పటి ‘బ్రో’ వరకు, దాదాపుగా ఏ చిన్న జ్ఞాపకాన్ని కూడా వదలకుండా చూసుకున్నారు. మధురమైన క్షణాలన్నిటినీ ఫోటోల రూపంలో దాచుకోవడం, బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో వాటికి వీడియో చేయడం ఆకట్టుకుంటుంది. ఈ వీడియో ఆలా షేర్ చేసారో లేదో..రికార్డు స్థాయిలో వ్యూస్, లైక్స్ వస్తున్నాయి. మీరు కూడా ఈ పోస్ట్ ఫై లుక్ వెయ్యండి.

View this post on Instagram

A post shared by Pawan Kalyan (@pawankalyan)