నేడు కాకినాడకు పవన్‌ కళ్యాణ్‌

Pawan Kalyan
Pawan Kalyan

కాకినాడ: జనసేన కార్యకర్తలపై జరిగిన దాడిలో గాయపడిన జనసేన నాయకులు, కార్యకర్తల్ని పరామర్శించేందుకు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ నేడు కాకినాడకు వెళ్లనున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆయన.. మంగళవారం అక్కడ బయల్దేరి నేరుగా విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన కాకినాడ వెళ్తారు. గాయపడిన కార్యకర్తలను పరామర్శించాక జిల్లా ముఖ్య నాయకులతో సమావేశమవుతారు. జనసేన పార్టీ భవిష్యత్‌ కార్యచరణపై అక్కడి నాయకులతో పవన్‌ కళ్యాణ్‌ చర్చించనున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/