తిరుప‌తిలో రీపోలింగ్ నిర్వ‌హించాలి: భాజపా అభ్యర్థిని రత్న ప్రభ డిమాండ్

అధికార వైకాపా దొంగ ఓట్లు పోల్ చేసిందని ఆరోపణ

Ratna Prabha
Ratna Prabha

Tirupati: తిరుప‌తిలో రీపోలింగ్ నిర్వ‌హించాల‌ని బిజెపి అభ్య‌ర్ధి కె ర‌త్న‌ప్ర‌భ డిమాండ్ చేశారు.. తిరుప‌తి ఉప ఎన్నిక‌ల‌లో భాగంగా పోలింగ్ కేంద్రాల‌లోఅధికార వైకాపా దొంగ ఓట్లు పోల్ చేయించింద‌ని ఆరోపించారు.. ప‌లు కేంద్రాల‌లో తాను త‌నిఖీ చేసిన సంద‌ర్భంలో దొంగ ఓట్లు వేయ‌డం గ‌మనించాన‌ని, వారంద‌ర్ని అరెస్ట్ చేయించ‌డం జ‌రిగింద‌న్నారు… అలాగే ఇత‌ర ప్రాంతాల నుంచి దొంగ ఓట‌ర్ల‌ను రవాణా చేస్తున్న ప‌లు ప్రైవేటు వాహ‌నాల‌ను సైతం తాను ద‌గ్గ‌రుండి సీజ్ చేయించాన‌ని తెలిపారు… ప్ర‌జ‌ల‌ను ఓటు వేయ‌కుండా చేసి వైకాపా ప్ర‌జాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని అన్నారు..పోలీసులు సైతం దొంగ ఓట్ల‌ను అడ్డుకోలేక‌పోయారని ఆమె విమర్శించారు. . తిరుప‌తిలో రీపోలింగ్ నిర్వ‌హించాల‌ని ఆమె డిమాండ్ చేశారు..

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/