అమరావతి రాజధాని కేసు.. డిసెంబర్‌కు వాయిదా

Amaravati capital case postponed to December says supreme court

న్యూఢిల్లీ: అమరావతి రాజధాని వ్యవహారంపై దాఖలైన పిటిషన్ల విచారణను సుప్రీంకోర్టు డిసెంబర్‌కు వాయిదా వేసింది. పూర్తిస్థాయి విచారణ డిసెంబర్లో చేపడతామని ధర్మాసనం వెల్లడించింది. కేసును అత్యవసరంగా విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది సుప్రీంను కోరగా.. నవంబర్‌ వరకు రాజ్యాంగ ధర్మాసనాల కేసులు ఉన్నాయని తెలిపింది. డిసెంబర్‌లోపు అత్యవసరంగా కేసు విచారణ సాధ్యంకాదని సుప్రీం స్పష్టం చేసింది. కాగా, ఆరు నెలల్లో అమరావతి నిర్మించాలన్న ఆంధ్రప్రదేశ్ హై కోర్టు ఆదేశాలపై గత విచారణలో సుప్రీంకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే.