ఉత్తుత్తి ఉద్యమాన్ని ప్రారంభించారు

ఆఖరున వచ్చిన డబ్బును పంచుకొని ఎవరి దారిన వాళ్లు వెళ్లి పోతారు

vijaya sai reddy
vijaya sai reddy

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. అమరావతిని ఎలా మారుస్తారని పళ్లు కొరికారు. ప్రభుత్వం కూలిపోతుందని శాపాలు పెట్టారు. చంద్రబాబు నాయుడు ఉత్తుత్తి ఉద్యమాన్ని ప్రారంభించారని విజయసాయిరెడ్డి ఏద్దేవా చేశారు. బంగారు నగల సేకరణకు దిగారు. తర్వాత జోలెతో ఊరూరూ తిరుగుతున్నారు. ఆఖరున వచ్చిన డబ్బును టిడిపి నేతలు తల ఇంతా పంచుకొని ఎవరి దారిన వారు పోతారని విజయసాయిరెడ్డి ఆరోపించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/