తెలంగాణ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన

Pawan-kalyan
Pawan-kalyan

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో తెలంగాణ రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. రీసెంట్ గా అనంతపురం జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్ర పేరుతో ఆత్మ హత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను పరామర్శించి , వారికీ ఆర్ధిక సాయం అందజేసిన సంగతి తెలిసిందే. మొదటి విడతలో భాగంగా ఆత్మహత్యలకు పాల్పడిన 31 మంది కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి, ఒక్కొక్క రైతు కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప‌వ‌న్ అందించారు.

ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. ప్రమాదవశాత్తు చనిపోయిన జనసైనికుల కుటుంబాలను పవన్ పరామర్శించి వారికీ అర్దిక్ సాయం అందించబోతున్నట్లు తెలంగాణ జనసేన నేతలు చెపుతున్నారు. వారం పది రోజుల్లో చౌటుప్పల్, హుజూర్ నగర్ లో పవన్ కల్యాణ్ పర్యటన ఉంటుందని నేతలు తెలిపారు. తెలంగాణలో జనసేనకు బలమైన ఓటు బ్యాంకు ఉందని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. తెలంగాణలో క్రియాశీలక సభ్యత్వ నమోదుపైనా జనసేన పార్టీ దృష్టి పెడుతుందని ఆయన చెప్పారు.