మంత్రి పువ్వాడను సత్కరించిన సీఎం కేసీఆర్

తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ని ముఖ్యమంత్రి కేసీఆర్ శాలువాతో సత్కరించారు. మంగళవారం అజయ్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామికి 1 కేజీ బంగారం, పట్టు వస్త్రాలు అందించినందుకు మంత్రి పువ్వాడను కేసీఆర్ అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ ను కేసీఆర్ సత్కరించి…జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంత్రి సతీమణి పువ్వాడ వసంత లక్ష్మి, కుమారుడు నయన్ రాజ్ పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి లోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని మంత్రి పువ్వాడ దర్శించుకున్నారు. మంత్రి తన జన్మదినాన్ని పురస్కరించుకొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా ఆలయం లోని విమాన గోపురానికి..ఖమ్మం ప్రజల, రాష్ట్ర ప్రభుత్వం తరపున1 కేజీ బంగారం, పట్టు వస్త్రాలను కలెక్టర్ పమేలా సత్పతి సమక్షంలో మంత్రి అజయ్ కుమార్ ఆలయ ఈవో గీతకు అందజేశారు.