బండి సంజయ్ అరెస్టుపై కెటిఆర్‌ ట్వీట్

పిచ్చోని చేతిలో రాయి ఉంటే ప్రమాదం.. కెటిఆర్

telangana-minister-ktr-reacts-on-bandi-sanjay-arrest

హైదరాబాద్ః మంత్రి కెటిఆర్‌ పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్ విషయంపై బుధవారం స్పందించారు. ట్విట్టర్ వేదికగా బిజెపి నేతలపై విమర్శలు గుప్పించారు. ఈ కేసులో బిజెపి తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ పిచ్చోని చేతిలో రాయి ఉంటే ప్రమాదమంటూ మంత్రి ట్వీట్ చేశారు. నీచ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన బిజెపి.. పేపర్ లీకేజీ కుట్రలో తెలంగాణ బిజెపి అధ్యక్షుడి అరెస్ట్.. అంటూ బిఆర్ఎస్ పార్టీ చేసిన ట్వీట్ ను మంత్రి కెటిఆర్ రీట్వీట్ చేశారు.

మంత్రి ట్వీట్..

పిచ్చోని చేతిలో రాయి ఉంటే..
వచ్చి పోయేటోళ్ళకే ప్రమాదం…!!
కానీ,
అదే పిచ్చోని చేతిలో ఒక పార్టీ ఉంటే
ప్రజాస్వామ్యానికే ప్రమాదం…!! తమ స్వార్థ రాజకీయాల కోసం
ప్రశ్నా పత్రాలు లీక్ చేసి అమాయకులైన విద్యార్ధుల, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న బిజెపి నాయకులు..