కన్నడ స్టార్స్ ఉపేంద్ర, కిచ్చా సుదీప్ లకు క్షమాపణలు తెలిపిన పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..కన్నడ స్టార్స్ ఉపేంద్ర, కిచ్చా సుదీప్ లకు క్షమాపణ తెలిపారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎంత బిజీ గా ఉన్నారో చెప్పాల్సిన పనిలేదు. ఓ వైపు రాజకీయాలు , మరోవైపు వరుస సినిమాలు..ఇలా క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. దీంతో పలు ఈవెంట్స్ కు హాజరుకాలేకపోతు..తనకు ఆహ్వానం పంపిన వారికీ క్షేమపణలు తెలుపుతున్నారు. తాజాగా కన్నడ స్టార్స్ ఉపేంద్ర, కిచ్చా లు నటించిన కబ్జా చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఈ చిత్ర ఆడియో ఫంక్షన్ కు ముఖ్య అతిధిగా రావాలని పవన్ కళ్యాణ్ ను కోరారు. కానీ రాజకీయ కార్యక్రమాలు ఉండడం తో పవన్ హాజరుకాలేకపోతున్నారు. దీంతో వారికీ పవన్ క్షమాపణలు తెలిపారు.

తనను ‘కబ్జా’ ఆడియో ఫంక్షన్ కు ఆహ్వానించినందుకు పవన్ ధన్యవాదాలు తెలిపారు. అయితే, రాజకీయపరంగా ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల వల్ల ఈవెంట్ కు హాజరుకాలేకపోతున్నానని, చాలా బాధపడుతున్నానని చెప్పారు. ఉపేంద్ర, సుదీప్ కు తన ప్రత్యేక శుభాకాంక్షలు అని అన్నారు. ఇద్దరూ వెరైటీ పాత్రలను పోషిస్తూ వివిధ భాషల్లో గుర్తింపును పొందారని చెప్పారు. ఈ చిత్రం సూపర్ హిట్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. ప్రస్తుతం పవన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఈ మూడు సినిమాలతో బిజీ బిజీ గా గడుపుతున్నారు.