ఫ్లోరోసిస్‌ బాధితుడు అంశాల స్వామి మృతి

ఫ్లోరోసిస్ రక్కసిపై యుద్ధం చేసిన, ఫ్లోరోసిస్ బాధ నుండి విముక్తి కల్పించాలని డిమాండ్ చేసి, గల్లీ నుంచి ఢిల్లీ వరకు నల్గొండ ఫ్లోరోసిస్ సమస్యను తెలియజేసిన అంశాల స్వామి (32) మృతి చెందారు. శనివారం ఉదయం ప్రమాదవశాత్తు బైక్‌పైనుంచి పడి చనిపోయారు. నల్లగొండ జిల్లా శివన్నగూడెం గ్రామానికి చెందిన స్వామి చిన్నతనంలోనే ఫ్లోరోసిస్ బారినపడ్డారు. ఫ్లోరైడ్ రక్కసిని తరమికొట్టాలని అవిశ్రాంతంగా పోరాడారు. ఫ్లోరైడ్ బాధితుల తరపున గళం వినిపించారు.

అంశాల స్వామి మృతిపట్ల మంత్రి కేటీఆర్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ‘ఫ్లోరోసిస్ బాధితుడైన స్వామి ఫ్లోరైడ్‌ సమస్యపై అవిశ్రాంతంగా పోరాడారు. ఆయన ఎంతో మందికి స్ఫూర్తి. ఎప్పటికీ తన మనసులో గుర్తుండిపోతాడు. అతని ఆత్మకు శాంతి చేకూరాలి’ అని ట్వీట్‌ చేశారు. ఇక గతేడాది అక్టోబర్‌ 13న మంత్రి కేటీఆర్‌ అంశాల స్వామి ఇంటికి వెళ్లడం, ఆయనతో కలిసి భోజనం చేయడం జరిగింది. అలాగే డబుల్ బెడ్ రూమ్ ను స్వామి కి అందజేయడం జరిగింది. స్వామి మరణం ఫై యావత్ నల్గొండ వాసులు, యువత , టిఆర్ఎస్ శ్రేణులు సంతాపం తెలియజేస్తున్నారు.