పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ ల మూవీ టైటిల్ ఇదేనా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ ల కలయికలో సముద్రఖని డైరెక్షన్లో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘బ్రో’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ‘బ్రో’ అనే పదం ఇప్పటికే జనాల్లో విపరీతంగా నానిపోయింది. ఇలాంటి పదాన్ని టైటిల్‌గా పెడితే మరింత ప్రచారం దక్కుతుంది. ఇప్పటికే ఈ టైటిల్ మెగా అభిమానులకు బాగా నచ్చినట్టుంది. సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. మరి నిజంగా మేకర్స్ ఈ టైటిల్ ను ఫిక్స్ చేసారా..? లేదా..? అధికారిక ప్రకటన వస్తే కానీ తెలియదు.

తమిళ సినిమా ‘వినోదయ సిత్తం’కు ఇది అఫీషియల్ రీమేక్. సోషియో ఫాంటసీ కామెడీ డ్రామాగా తమిళంలో తెరకెక్కిన ఈ సినిమా అక్కడ మంచి విజయాన్ని అందుకుంది. తమిళంలో దర్శకత్వం వహించిన సముద్రఖని.. తెలుగు రీమేక్‌నూ డైరెక్ట్ చేశారు. కాకపోతే కథలో కొన్ని మార్పులు చేసినట్టు సమాచారం. ఇప్పటికే పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన సన్నివేశాలను దర్శకుడు సముద్రఖని చిత్రీకరించేశారు. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ పార్ట్ చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాలో ఒక పబ్ సాంగ్ ఉందట. ఈ పాట చిత్రీకరణ కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లో అత్యంత భారీ సెట్ వేస్తున్నారట. ఈ నెలలోనే ఈ పాట చిత్రీకరణ ఉండనుందని అంటున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ మూవీ ని నిర్మిస్తుండగా , థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.