పవన్ కల్యాణ్ శ్రమదాన వేదిక మార్పు

దుర్గమ్మ గుడి వద్ద సభ అనంతరం శ్రమదాన కార్యక్రమం

అమరావతి : పవన్ కల్యాణ్ శ్రమదాన వేదికను జనసేన పార్టీ మార్చింది. ఏపీలోని రోడ్ల దుస్థితిని ఎత్తిచూపుతూ రేపు రాజమండ్రి కాటన్ బ్యారేజీపై శ్రమదానం నిర్వహిస్తానని పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఇరిగేషన్ అధికారులు అందుకు అనుమతి నిరాకరించారు. దీంతో కార్యక్రమాన్ని హుకుంపేటలోని బాలాజీపేటకు మార్చారు. అక్కడి కనకదుర్గమ్మ గుడి వద్ద సభ అనంతరం శ్రమదానం చేస్తారని పార్టీ వెల్లడించింది. కాగా, పవన్ శ్రమదానం నేపథ్యంలో బ్రిడ్జిపై గురువారం రాత్రి ప్రభుత్వం మరమ్మతులు చేసింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/