కెసిఆర్ సంపూర్ణంగా కోలుకోవాలి : పవన్ కళ్యాణ్

అనారోగ్య పరిస్థితులను మనోధైర్యంతో కెసిఆర్ అధిగమించాలని ఆకాంక్ష

pawan-kalyan-on-kcr-injured

అమరావతిః మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ జారిపడి గాయమైందని తెలిసి బాధపడ్డానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కెసిఆర్ త్వరగా… సంపూర్ణంగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. అనారోగ్య పరిస్థితులను మనోధైర్యంతో కెసిఆర్ అధిగమించాలన్నారు. కెసిఆర్ కోలుకొని ప్రజలకు సేవ చేస్తారని ఆకాంక్షించారు. కాగా, మాజీ సీఎం కెసిఆర్ అర్ధరాత్రి కాలుజారి కిందపడిన విషయం తెలిసిందే. ఆయనను యశోద ఆసుపత్రిలో చేరారు. కెసిఆర్ ఎడమ కాలు తుంటి ఎముక మార్పిడి చేయాలని డాక్టర్లు తెలిపారు. ఆయన కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాలు పడుతుందన్నారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.