నేడు, రేపు తెలంగాణలో వర్షాలు

కొన్ని ప్రాంతాల్లో ఎండలు, మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు

హైదరాబాద్: నేడు, రేపు తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నిన్న కూడా హైదరాబాద్‌ సహా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. నిజానికి రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఎండలు అల్లాడిస్తుంటే మరికొన్ని ప్రాంతాల్లో చినుకులు పడుతున్నాయి.

కాగా, విదర్భ నుంచి తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావంతోనే వర్షాలు కురుస్తున్నట్టు వాతావరణశాఖ తెలిపింది. ఆదిలాబాద్ జిల్లాలోని చాప్రాలలో నిన్న అత్యధికంగా 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నెలలో ఈ స్థాయిలో ఉష్ణోగ్రత పెరగడం ఇదే తొలిసారి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/