తెలంగాణలో 24 గంటల జనతా కర్ఫ్యూ

ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపు

24-hour Janata curfew in Telangana: TS CM KCR

Hyderabad: తెలంగాణలో 24 గంటల పాటు జనతా కర్ఫ్యూ పాటిద్దామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్‌ అన్నారు.

ప్రధాని చెప్పింది ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకేనని, తెలంగాణలో ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు జనతా కర్ఫ్యూ పాటిద్దామని కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

ఎమర్జెన్సీ కోసం డిపోకి 5 బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బస్సులకు రేపు రాష్ట్రంలోకి ఎంట్రీ లేదన్నారు. మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సులు, దుకాణాలు, అన్ని సేవలూ బంద్‌ ఉంటాయన్నారు.

ఎమర్జెన్సీ సర్వీసులు మాత్రమే అందుబాటులో ఉంటాయన్నారు. మిగతా వాళ్లు స్వచ్ఛందంగా బంద్‌ పాటించాలన్నారు.

మన కోసం.. మన సమాజం.. మన ప్రపంచం కోసం 24 గంటల కర్ఫ్యూ పాటిద్దామన్నారు.

సాయంత్రం 5 గంటలకు అందరూ ఎక్కడివాళ్లు అక్కడే చప్పట్లు కొట్టాలన్నారు. జాతి ఐక్యతను చాటేందుకే అందరూ చప్పట్లు కొట్టాలన్నారు.

తాజా సినిమా వార్తల కోసం :https://www.vaartha.com/news/movies/