నేటి నుండి మూడు రోజుల పాటు కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటన

టీడీపీ అధినేత , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి నుండి మూడు రోజుల పాటు కర్నూల్ జిల్లాలో పర్యటించబోతున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన రెండు రాత్రులు జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో బస చేయనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి.. 12 గంటలకు కర్నూలు విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అనంతరం కోడుమూరు, కరివేముల, దేవనకొండ మీదుగా రోడ్డు మార్గంలో పత్తికొండకు చేరుకుంటారు. సాయంత్రం పత్తికొండలో రోడ్డు షో నిర్వహిస్తారు.

అనంతరం కోరమాండల్ ఫర్టిలైజర్ ప్రాంతంలో బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. రాత్రికి ఆదోనిలో బస చేయనున్న చంద్రబాబు.. గురవారం పట్టణంలో రోడ్డు షో నిర్వహిస్తారు. రాత్రికి కర్నూలులో బస చేయనున్న చంద్రబాబు… శుక్రవారం నగరంలో పార్టీకి చెందిన జిల్లా నేతలతో సమావేశం నిర్వహిస్తారు. చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను తెలుగుదేశం నేతలు పరిశీలించారు. పర్యటన విజయవంతం చేసేందుకు అందరూ కలిసిరావాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు పర్యటన పార్టీ శ్రేణులు, కర్నూలు ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని, భరోసాను తీసుకొస్తుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.