చంద్రబాబు మీద ఓ కన్నేసి ఉంచు..పవన్ కల్యాణ్ కు కొట్టు సత్యనారాయణ సలహా

స్థిరత్వం లేని మాటలతో చులకన కావొద్దని పవన్ కు సూచన

kottu-satyanarayana

అమరావతిః తనకు ప్రాణహాని ఉందంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి కొట్టు సత్యనారాయణ స్పందించారు. ఆ ముప్పు చంద్రబాబు నుంచే ఉందని పవన్ గ్రహించాలని మంత్రి అన్నారు. తమ్ముడూ పవన్ కల్యాణ్… చంద్రబాబుపై ఓ కన్నేసి ఉంచు అని చెప్పారు. చంద్రబాబును జాగ్రత్తగా ఓ కంట కనిపెట్టుకుంటూ ఉండు అని సూచించారు. వంగవీటి మోహనరంగా హత్యకు పన్నాగం పన్నిన వారిలో చంద్రబాబు హస్తం కూడా ఉందని చెప్పారు. పవన్ కు ఏదైనా జరిగితే ఆ నెపాన్ని వైఎస్‌ఆర్‌సిపిపైకి నెట్టేసి, రాజకీయంగా లబ్ధి పొందేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

స్థిరత్వం లేని మాటలతో చులకన కావొద్దని చెప్పారు. మహానాడు ఫ్లాప్ కావడంతో కాపు సామాజికవర్గ ఓట్ల కోసం పవన్ ను చంద్రబాబు పావుగా వాడుకుంటున్నారని విమర్శించారు. సొంతంగా పార్టీ పెట్టుకున్న పవన్ కల్యాణ్ కు దమ్ముంటే మొత్తం 175 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాలని సవాల్ విసిరారు.