క్యాన్సర్ ప్రచారం ఫై కొడాలి నాని క్లారిటీ

kodali nani as ap state development board chairman

మాజీ మంత్రి , గుడివాడ వైస్సార్సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని క్యాన్సర్ బారినపడినట్లు సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారం జరగడం తో నాని ఈ వార్తల ఫై స్పందించారు. తాను క్యాన్సర్ తో హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో చేరారంటూ వస్తున్న కథనాల్లో నిజంలేదని స్పష్టం చేశారు. కొందరు కావాలనే దురుద్దేశంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

‘నాకు ఎలాంటి క్యాన్సర్ లేదు.. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. టీడీపీ నాపై తప్పుడు ప్రచారం చేస్తుంది.. చంద్రబాబు రాజకీయాల నుంచి ఇంటికి పంపించేంతవరకు నేను భూమ్మీదనే ఉంటాను. కొంతమంది శునకానందం కోసం నాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఇది ముమ్మాటికి దిగజారుడు తనానికి నిదర్శనం. ధైర్యంగా ఎన్నికల్లో ఎదుర్కొనలేక, తప్పుడు రాతలు రాస్తూ.. తప్పుడు కథనాలు ప్రచారం చేస్తూ.. దిగజారిపోతున్న దిష్టచతుష్టయం ఇలాంటి ఆరోపనలు చేస్తుంది.. చంద్రబాబు, లోకేష్ దమ్ముంటే గుడివాడ రావాలి’ అంటూ సవాల్ విసిరారు.

ఇదిలా ఉంటే నాని ఆరోగ్యం పై వస్తున్న వార్తలను వైస్సార్సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. కొడాలి నానీని రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన పై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను మానసికంగా దెబ్బ తీయడం కోసం సోషల్ మీడియాలో, కొన్ని శాటిలైట్ ఛానల్స్ లో ఇటువంటి ప్రచారం చేస్తున్నారని వైస్సార్సీపీ నేతలు ఆరోపించారు. జూలై 8వ తేదీన, జూలై 9వ తేదీన కొడాలి నాని వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారని పేర్కొన్నారు. కొడాలి నానిపై దుష్ప్రచారాలు మానుకోకపోతే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారు అని వారంతా అన్నారు.