కేంద్రమంత్రికి వైసీపీ ఎంపీ RRR లేఖ..వెంటనే లైసెన్స్‌ను రద్దు చేయాలనీ పిర్యాదు

వైసీపీ రెబెల్ ఎంపీ గా గుర్తింపు తెచ్చుకున్న నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు ..కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌కు లేఖ రాశారు. ఏపీలో ఫైబర్ నెట్ సంస్థ అక్రమంగా, అనధికారికంగా ఎంఎస్ఓ లైసెన్స్ ఉపయోగిస్తోందని..బ్రాడ్ కాస్టింగ్ బిల్లు 1997 ప్రకారం ప్రభుత్వ సంస్థలు, ఎంఎస్‌వో లైసెన్స్ పొందలేవని..తక్షణమే చర్యలు తీసుకొని అక్రమ లైసెన్స్‌ను రద్దు చేయాలని లేఖలో ప్రస్తావించారు. ప్రస్తుతం అశ్విని వైష్ణవ్ కేంద్ర రైల్వే, కమ్యూనికేషన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖల మంత్రిగా కొనసాగుతుండడం తో ఆయనకు లేఖ రాయడం జరిగింది.