విజయ్ కోసం పవన్ కళ్యాణ్..?

విజయ్ నటించిన వారసుడు కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోతున్నాడా..? ప్రస్తుతం ఫిలిం సర్కిల్లో ఇదే చర్చ నడుస్తుంది. విజయ్ – రష్మిక జంటగా వంశీ పైడిపల్లి డైరెక్షన్లో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం వారసుడు. తమిళ్ లో (వరిసు) పేరుతో రిలీజ్ కాబోతుంది. తెలుగు , తమిళ్ భాషల్లో ఏక కాలంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదల కాబోతుంది.

ఇప్పటికే ఈ సినిమా తాలూకా ప్రమోషన్స్ సినిమా ఫై అంచనాలు పెంచేస్తుండగా..తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను ఈ నెల 27వ తేదీన జరపాలని చూస్తున్నారట. ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించినట్లు..దానికి పవన్ కూడా ఓకే చెప్పినట్లు ఫిలిం సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో దిల్ రాజు బ్యానర్ లో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీ చేసిన సంగతి తెలిసిందే. అంతే కాదు పవన్ కళ్యాణ్ – విజయ్ ల మధ్య కూడా మంచి స్నేహం ఉంది. అందుకే వారి సినిమా అనగానే పవన్ ఓకే చెప్పాడని అంటున్నారు.