కేశినేని నాని కుమార్తె వివాహ వేడుకకు హాజరైన చంద్రబాబు

టీడీపీ ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత వివాహ వేడుకకు టీడీపీ అధినేత , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతిమేతంగా హాజరై , నూతన వధూవరులను ఆశీర్వదించారు. శాసనసభ మాజీ స్పీకర్ కాజ రామనాథం మనవడు రఘు తో నాని కుమార్తె శ్వేత వివాహం కన్నుల పండుగగా జరిగింది.

ఈ సందర్బంగా చంద్రబాబు వధూవరులు శ్వేత, రఘులను ఆశీర్వదించారు. ఈ వివాహ వేడుకకు రాజకీయ నేతలతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు సైతం హాజరయ్యారు. ఇక కేశినేని శ్వేత, రఘుల నిశ్చితార్థం గత జులై 31న హైదరాబాదులోని హోటల్ తాజ్ కృష్ణలో ఘనంగా నిర్వహించారు.