ఈరోజు చంద్రబాబు ను కలవనున్న పవన్ , బాలకృష్ణ , లోకేష్

టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు ను స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సిబిఐ అరెస్ట్ చేసి రాజమండ్రి జైలు కు తరలించిన సంగతి తెలిసిందే. ఏసీబీ కోర్ట్ రెండు వారాల పాటు రిమాండ్ విధించడం తో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఈ క్రమంలో ప్రతి రోజు చంద్రబాబు ను కుటుంబ సభ్యులు , లాయర్లు, టీడీపీ నేతలు కలుస్తూ వస్తున్నారు.

నేడు బాలకృష్ణ, పవన్‌ కల్యాణ్‌, నారా లోకేష్‌లు జైలు కు వెళ్లి చంద్రబాబు ను కలవనున్నారు. ఉదయం 11.30 గం.ల సమయంలో కలవనున్నారు. చంద్రబాబుతో ములాఖాత్‌ అనంతరం వీరు జైలు బయటే మీడియాతో మాట్లాడనున్నారు. ఈ నేపథ్యంలోనే రాజమండ్రి సెంట్రల్‌ జైలు వద్ద భద్రతను అధికారులు పెంచారు. దాదాపు 300 మంది పోలీసులతో బందోబస్తుతో పాటు, ప్రభుత్వ ఆసుపత్రి, ఆర్ట్స్‌ కాలేజ్‌ వద్ద వాహనాల దారి మళ్లింపుచేశారు. ఎయిర్పోర్ట్‌ నుండి సెంట్రల్‌ జైలు వరకు పోలీసుల పికెటింగ్‌ ఏర్పాటు చేశారు.