రేపట్నుంచి ఏపీలో ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ క్యాంపెయిన్

ఏపీ సర్కార్ మరో వినూత్న పధకానికి శ్రీకారం చుట్టారు. రేపటి నుండి ‘జగనన్న సురక్ష’ అనే కార్యక్రమం మొదలుచేయబోతుంది. ఇంటింటికీ ఆరోగ్య సిబ్బంది వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటారు, అక్కడే కావాల్సిన పరీక్షలు చేస్తారు. ఆ తర్వాత ప్రత్యేకంగా హెల్త్ క్యాంపులు పెట్టి.. కళ్లజోళ్లు, ఫుడ్ సప్లిమెంట్లు, ఇతర మందులు అందిస్తారు.

బుధవారం ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ జవహర్‌ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటి.కృష్ణబాబులతో కలసి తాడేపల్లి సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. వాలంటీర్లు, గహ సారథులు, ప్రజాప్రతినిధులు జగనన్న ఆరోగ్య సురక్ష పథకం కింద ఇంటింటికీ తిరిగి ఆరోగ్య పరిస్థితులపై సర్వే నిర్వహిస్తారన్నారు. 30న రాష్ట్రవ్యాప్తంగా, మెడికల్‌ క్యాంపులు నిర్వహించి ప్రజల ఆరోగ్య పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

అనంతరం కలెక్టరేట్లో కలెక్టర్‌తో పాటు జాయింట్‌ కలెక్టర్‌ టిఎస్‌.చేతన్‌, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ ఎస్‌వి.కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్న సమావేశంలో రాష్ట్ర ప్రజల ఆరోగ్య సమస్యలు తీర్చడానికి మరొక వినూత్న కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారని కలెక్టర్‌ పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా జరగనున్న వివిధ ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు, ఆరోగ్యశ్రీ పథకంపై కూడా విస్తతంగా అవగాహన కల్పించాలన్నారు.