బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలికపాటి నుండి భారీ వర్షాలు పడనున్నాయి. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో రెండు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. బంగాళాఖాతంలో అల్పపీడనానికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉన్నట్లు వెల్లడించింది.

కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తారు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. కొన్నిచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం, కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఇక.. తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.