నవంబరు నెలలో బ్యాంకులకు 17 రోజులు సెలవులు

నెల మారిందంటే ముందుగా బ్యాంకు ఖాతాదారులు అలర్ట్ అవుతారు. ఈ నెలలో ఎన్ని రోజులు బ్యాంకులు పనిచేస్తాయి..ఎన్ని రోజులు బ్యాంకులకు సెలవులు అనేవి చూస్తుంటారు. వాటిని బట్టి తమ బ్యాంకు పనులను చేసుకుంటుంటారు.. ఇక ఇప్పుడు నవంబర్ నెల రాబోతుంది. ఈ క్రమంలో బ్యాంకు ఖాతాదారులు నెలలో ఎన్ని రోజులు సెలవులో తెలుసుకునే పనిలో పడ్డారు. అయితే నవంబర్ నెలలో వరుస పండుగలు, శని, ఆదివారపు సెలవు దినాలు కలిపి మొత్తం 17 రోజులు బ్యాంకులకు సెలవులు వచ్చాయి.

వీటిలో కొన్ని ఆయా రాష్ర్టాలకు మాత్రమే పరిమితం అయినా దేశం మొత్తం మీద కనీసం సగం రోజులు బ్యాంకులు పని చేయవని ఆర్‌బీఐ జారీ చేసిన మార్గదర్శకాల ద్వారా తెలుస్తోంది. నవంబరు 13, 27 తేదీలు రెండవ, నాల్గవ శనివారాలు, 7, 14, 21, 28 ఆదివారాలు ఇవి సాధారణ సెలవులే.

నవంబర్‌ 1: కన్నడ రాజ్యోత్సవ్‌, నవంబర్‌ 3: నరక చతుర్దశి, నవంబర్‌ 4: దీపావళి అమావాస్య, నవంబర్‌ 5: బలి ప్రతిపద/విక్రమ సంవత్సరం ప్రారంభం/గోవర్థన్‌ పూజ, నవంబర్‌ 6: భాయి దూజ్‌/చిత్రగుప్త జయంతి, నవంబర్‌ 10, నవంబర్‌ 11: చాత్‌ పూజ, నవంబర్‌ 12: వంగల ఫెస్టివల్‌, నవంబర్‌ 19: గురునానక్‌ జయంతి/కార్తీక పౌర్ణమి, నవంబర్‌ 22: కనకదాస జయంతి, నవంబర్‌ 23 : సెంగ్‌ కుత్స్నెమ్‌ (వీటిలో కొన్ని సెలవులు ఆయా రాష్ర్టాలకే పరిమితం) కానున్నాయి.