ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు రూ. 50 వేలు మంజూరు

అమరావతి : ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులను జారీ చేసింది. కరోనా వల్ల మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 50 వేల చొప్పున మంజూరు చేస్తూ ఉత్తర్వులను విడుదల చేసింది. కరోనా వల్ల చనిపోయిన వారి కుటుంబాలకు ఈ పరిహారాన్ని అందజేయనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ పరిహారం కోసం బాధిత కుటుంబాలు చేసుకునే దరఖాస్తు నమూనాను కూడా ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఈ పరిహారాన్ని రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి నుంచి చెల్లించాలని సంబంధింత శాఖను ప్రభుత్వం ఆదేశించింది. డీఆర్‌వో నేతృత్వంలో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు ద్వారా బాధిత కుటుంబాలకు రెండు వారాల్లో చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. కుటుంబ సుభ్యుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం సూచించింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/