రైతుల త్యాగాలను ముఖ్యమంత్రి అవమానిస్తున్నారు
రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నియంత పాలన సాగిస్తున్నారన్నారు

అమరావతి: రైతుల త్యాగాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవమానిస్తున్నారని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు విమర్శించారు. మంగళవారం మందడంలో మహిళలు చేస్తున్న దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో జగన్ నియంత పాలన సాగిస్తున్నారన్నారు. 151 మంది ఎమ్మేల్యేల బలం ఉందని మదమెక్కి మాట్లాడుతున్నారని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. రాజధాని ప్రాంత రైతులు, మహిళలను ఉన్నాదులుగా చిత్రీకరించటం సిగ్గుచేటని ఆయన ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. కేసులు, బెదిరింపులతో అమరావతి ఉద్యమం ఆగదని వడ్డే శోభనాద్రీశ్వరరావు స్పష్టం చేశారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/