మాజీ సీఎం అజిత్ జోగీకి అస్వస్థత

రాయ్‌పూర్‌లోని ఓ ఆసుపత్రిలో చేరిక..

మాజీ సీఎం అజిత్ జోగీకి అస్వస్థత
ex-cm-ajit-jogi

రాయ్‌పూర్ ‌: ఛత్తీస్‌గఢ్‌ మాజీ సిఎం అజిత్‌జోగీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా ఆయన తన ఇంటి వద్ద ఉన్న గార్డెన్‌లో ఉన్నట్టుండి పడిపోయారు. దీంతో కుటుంబసభ్యులు 12.30 గంటల సమయంలో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం… ప్రస్తుతం జోగి వెంటిలేటర్‌పై ఉన్నారని, శ్వాస తీసుకోవడంలో కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రస్తుతం ఆయన పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని వెల్లడించారు. కాగా 74 సంవత్సరాల అజిత్ జోగి 2000 -2003 సంవత్సరాల మధ్య ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/