‘పఠాన్’ బేషరమ్ రంగ్ సాంగ్ ఫై ట్రోల్స్

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ – దీపికా పదుకొనె జంటగా సిద్దార్థ్ ఆనంద్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ ‘పఠాన్’. ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ ‘బేషరమ్ రంగ్’ సాంగ్ రిలీజ్ అయ్యింది. ఈ సాంగ్ విడుదల అయ్యిందో లేదో దీనిపై నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు. ఈ సాంగ్ లో దీపిక పదుకోన్ అంగాంగ ప్రదర్శన, అందాల ఆరబోతపై నెటిజన్లు భగ్గుమంటున్నారు.

విదేశీ మూవీస్ నుండి డ్రస్సులు, హెయిర్ స్టెయిల్, సీన్లు, మ్యూజిక్, స్టైయిల్, కెమెరా వర్క్, ప్లాట్ లాంటివి కాపీ కొట్టారని , అలా కాపీ కొట్టి బాలీవుడ్ చెత్తను చేర్చి కొత్తగా చూపించే ప్రయత్నం చేసారని , వీధి భాగోతాల మాదిరి ఐటెమ్ నంబర్స్ సాంగ్ మాదిరిగా ఉందని , పోర్న్ సినిమాల్లో కూడా కనిపించవు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. బాయ్‌కాట్ బాలీవుడ్‌ అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండింగ్ అవుతున్నది. బేషరమ్ రంగ్ సాంగ్ రిలీజ్ తర్వాత బాయ్‌కాట్ పఠాన్ హ్యాష్ టాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. వల్గారిటీ, అసభ్యతతో ప్రేక్షకులను సినీ దర్శకులు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

YouTube video