మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఉదయనిధి స్టాలిన్

చెన్నైః తమిళనాడు కేబినెట్ మంత్రిగా సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం రాజ్ భవన్లో గవర్నర్ సిటీ రవి ఉదయనిధి చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి స్టాలిన్ తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, డిఎంకే నాయకులు హాజరయ్యారు.
కాగా, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఉదయనిధి స్టాలిన్కు రాష్ట్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖను కట్టబెట్టారు. మొత్తానికి నటుడిగా కోలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఉదయనిధి…ఆ తర్వాత నిర్మాత, డిస్ట్రిబ్యూటర్గా మారారు. గతేడాది తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన.. చెపాక్ తిరువల్లికెని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం రాష్ట్రానికి మంత్రి కూడా అయ్యారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/