రాబోయే ఎన్నికల్లో వైస్సార్సీపీ నుండి పోటీ చేస్తా – వల్లభనేని వంశీ

రాబోయే ఎన్నికల్లో గన్నవరం నుండి వైస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గా పోటీ చేయబోతున్నట్లు వల్లభనేని వంశీ క్లారిటీ ఇచ్చారు. ఎంపీ గా పోటీ చేయబోతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..చంద్రబాబు ఫై నిప్పులు చెరిగారు.14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. 2009లో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ కోసం ప్రచారం చేశారని… ఆ సమయంలో ఆయనకు చాలా పెద్ద యాక్సిడెంట్ అయిందని… భగవంతుని దయవల్ల ఆయన కోలుకున్నారని వంశీ తెలిపారు.

2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిందని, చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ఎన్టీఆర్ వచ్చారని… తారక్ ను కనీసం స్టేజ్ పైకి కూడా ఆహ్వానించలేదని విమర్శించారు. 2019 ఎన్నికల్లో ఎన్టీఆర్ ను కరివేపాకుగా వాడుకుని వదిలేశారని… 2014 ప్రమాణస్వీకారం సమయంలో పట్టించుకోలేదని, కనీసం తారక్ కు ఒక బ్యానర్ కూడా కట్టలేదని అన్నారు. జనాల మధ్యలో కూర్చోబెట్టారని విమర్శించారు. ఇప్పుడు అవసరం వచ్చిందని రమ్మంటే ఆయన ఎలా వస్తారని ప్రశ్నించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీకి వైయస్సార్ పేరు మార్చడంపై ఆలోచించాలని ముఖ్యమంత్రి జగన్ ను తాను కోరానని చెప్పారు. ఎన్టీఆర్, వైయస్సార్ ఇద్దరూ గొప్ప నాయకులని అన్నారు.