పవన్ వారాహి రిజిస్ట్రేషన్ కోసం ఎంత ఖర్చు చేసారో తెలుసా..?

గత వారం రోజులుగా పవన్ వారాహి ఫై పెద్ద చర్చ నడుస్తుంది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ లో వారాహి పిక్స్ పెట్టారో..అప్పటి నుండి వైస్సార్సీపీ నేతలు విమర్శలు చేస్తూనే ఉన్నారు. వారాహి కలర్ ఫై నానా రచ్చ చేస్తూ వచ్చారు. ఇక ఇప్పుడు వారాహి రిజిస్ట్రేషన్ పూర్తి కావడం..అన్ని అనుమతులు రావడం తో ..కలర్ వదిలిపెట్టి వారాహి నెం ఫై విమర్శలు చేస్తున్నారు వైస్సార్సీపీ నేతలు.

ఇదిలా ఉంటె వారాహి రిజిస్ట్రేషన్ కోసం జనసేన అక్షరాలా రూ.5000 ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. ఈ వారాహి TS 13 EX 8384 పేరుతో వారాహిని రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. రిజిస్ట్రేషన్ కోసం నిబంధనలకు అనుగుణంగా డబ్బుని చెల్లించి ఈ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పాపారావు తెలిపారు. అయితే ఈ నెంబర్ రిజిస్ట్రేషన్ కోసం రూ.5000 ప్రభుత్వానికి చెల్లించి రిజిస్ట్రేషన్ తీసుకున్నారు. సాధారణంగా స్పెషల్ నంబర్స్ అనేవి అంత ఈజీగా ఎవరికి అలర్ట్ కావు. అలాంటివి కావాలంటే ప్రభుత్వానికి రూ.5000 కట్టి మనకు కావాల్సిన నెంబర్ తీసుకోవచ్చు. ఈ క్రమంలోని వారాహికి కూడా రూ.5000 కట్టి 8384 అనే రిజిస్ట్రేషన్ నెంబర్ పవన్ కళ్యాణ్ తీసుకున్నారు అని వెల్లడించారు.