‘బంగార్రాజు’ నుండి రెండు క్రేజీ అప్డేట్స్ ..

బంగార్రాజు నుండి రెండు క్రేజీ అప్డేట్స్ అభిమానుల్లో సంబరాలు నింపుతున్నాయి. కింగ్ నాగార్జున , చైతన్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం బంగార్రాజు. “సోగ్గాడే చిన్ని నాయన” చిత్రానికి ఇది సిక్వెల్ గా తెర‌కెక్క‌తుంది. ఈ చిత్రంలో నాగ్ “బంగార్రాజు” పాత్రల్లో కనిపించ‌బోతున్నారు. నాగ్‌ కు జోడీ గా రమ్యకృష్ణ, నాగ చైతన్యకు జోడీగా కృతి శెట్టి నటిస్తున్నారు. ఇక ప్రమోషన్ ఫై దృష్టి సారించిన చిత్ర యూనిట్..నిన్న కృతి తాలూకా ఫస్ట్ లుక్ విడుదల చేసి ఆకట్టుకున్నారు.

ఇప్పుడు మరో రెండు అప్డేట్స్ ను తెలియజేసారు. ‘బంగార్రాజు’ పాత్రకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఈ నెల 22వ తేదీన సాయంత్రం 5:22 నిమిషాలకి విడుదల చేయనున్నారు. అలాగే ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ను ఈ నెల 23వ తేదీన 10:23 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ రెండు ముహూర్తాలను ఖరారు చేస్తూ అధికారిక పోస్టర్ ను విడుదల చేసారు. ‘బంగార్రాజు’ చిత్రాన్ని జీ స్టూడియోస్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు. సత్యానంద్ స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు.