పఠాన్ నుండి మరో రొమాంటిక్ సాంగ్..ఇది ఎలా ఉందంటే

Jhoome Jo Pathaan Song 

షారుఖ్ ఖాన్ నటిస్తున్న పఠాన్ నుండి మరో రొమాంటిక్ సాంగ్ విడుదలైంది. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ – దీపికా పదుకొనె జంటగా సిద్దార్థ్ ఆనంద్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ ‘పఠాన్’. ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ ‘బేషరమ్ రంగ్’ సాంగ్ రిలీజ్ అయ్యి..ఎంత వివాదం సృష్టించిందో చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా షారుఖ్ ఖాన్..ను కాల్చేస్తామంటూ రాజకీయ నేతలు హెచ్చరించారు.

ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే సినిమా నుండి మరో రొమాంటిక్ సాంగ్ విడుదలైంది. జూమే జో అంటూ సాగే సాంగ్ ను గురువారం రిలీజ్ చేసారు. మొదటి సాంగ్ తో పోలిస్తే..ఈ సాంగ్ లో కాస్త రొమాంటిక్ సన్నివేశాలు తగ్గాయి. కాకపోతే అక్కడక్కడ మాత్రం గ్లామర్ ట్రీట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే షారుక్ దీపికా రెండో సారి కూడా మళ్లీ ఎప్పటిలానే రొమాంటిక్ పాటతో కొంత బోరింగ్ కొట్టించారు అనే కామెంట్స్ వస్తున్నాయి.

YouTube video