2023 లో ప్రభాస్ నుండి నాల్గు సినిమాలు..?

Hero Prabhas
Hero Prabhas

బాహుబలి తో పాన్ ఇండియా స్టార్ అనిపించుకున్న ప్రభాస్..ఆ తర్వాత సాహో , రాధేశ్యామ్ తో వరుస పాన్ మూవీస్ చేసాడు. కాకపోతే ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ప్రస్తుతం నాల్గు పాన్ మూవీస్ చేస్తున్నాడు. ఇందులో ఆదిపురుష్ మూవీ షూటింగ్ ఇప్పటీకే పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అలాగే కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్ , మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రాజెక్ట్ కె , మారుతీ డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్నాడు.

ఈ మూడు సినిమాలన్నీ కూడా వచ్చే ఏడాది లోనే రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తుంది. మారుతీ మూవీ లో సంజయ్ దత్ నటిస్తుండడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. హిందీ మార్కెట్ పరంగానూ సినిమాకు వర్కవుట్ అవుతుందనటంలో సందేహం లేదు. ఈ చిత్రంలో ప్రభాస్ తాతయ్య పాత్రలో సంజయ్ దత్ కనిపించబోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి ఈయన పాత్రను మారుతి కామెడీ యాంగిల్‌లో చూపిస్తారా? లేక సీరియస్‌గా ఉంటుందా? అనేది చూడాల్సిందే.