రికార్డు స్థాయిలో విడుదల అవుతున్న 18 పేజెస్

కార్తికేయ 2 ఫేమ్ నిఖిల్ – అనుపమ జంటగా ప్రతాప్ తెరకెక్కించిన ప్రేమ కథ చిత్రం 18 పేజెస్. రేపు ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. కార్తికేయ 2 తర్వాత నిఖిల్ నుండి వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ క్రమంలో ఈ సినిమాను రికార్డు స్థాయిలో రిలీజ్ కాబోతుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ మూవీని నైజాంలో 135, సీడెడ్‌లో 65, ఆంధ్రాలో 185 వరకూ అంటే మొత్తంగా రెండు రాష్ట్రాల్లో కలిపి 385 నుంచి 400 థియేటర్లలో విడుదల అవుతోంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో 60, ఓవర్సీస్‌లో 400 థియేటర్లలో రాబోతుంది. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా దాదాపు 845 నుంచి 850 థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఇది నిఖిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ రిలీజ్ అని చెప్పొచ్చు. మరి రికార్డు స్థాయిలో విడుదల కాబోతున్న ఈ మూవీ కి ఎలాంటి టాక్ వస్తుందో..ఫస్ట్ డే ఏ రేంజ్ లో కలెక్షన్లు రాబడుతుందో చూడాలి.