ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైస్సార్సీపీ ఘనవిజయం

మరోసారి ఏపీ ఎన్నికల్లో వైస్సార్సీపీ సత్తా చాటింది. గత నాల్గు ఏళ్లుగా రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగిన వైస్సార్సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తూ వస్తున్నారు. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అదే రిపీట్ అయ్యింది. నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగ్గా..ఆ నాల్గింటిలోను వైస్సార్సీపీ అభ్యర్థులే విజయం సాధించింది. పశ్చిమ గోదావరి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైస్సార్సీపీ అభ్యర్థులు కవరు శ్రీనివాస్, వంకా రవీంద్రనాథ్ గెలుపొందారు.

కవరు శ్రీనివాస్ కు 481 ఓట్లు రాగా..వంకా రవీంద్రనాథ్ కు 460 ఓట్లు దక్కాయి. అటు కర్నూల్ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ మధుసూదన్ రావు గెలుపొందారు. శ్రీకాకుళం స్థానిక సంస్థల MLC కౌంటింగ్‌లో వైస్సార్సీపీ అభ్యర్థి నర్తు రామారావు విజయం సాధించారు. మొత్తం ఓట్లలో వైస్సార్సీపీ అభ్యర్థికి 632 ఓట్లు పోలయ్యాయి. పోటీలో ఉన్న స్వతంత్ర అభ్యర్థికి 108 ఓట్లు రాగా.. చెల్లని ఓట్లు 12 వచ్చాయి.

ఏపీలో మొత్తం 9 స్థానాలకు 139 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పట్టభద్రుల నియోజకవర్గ స్థానాలకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడ్డారు. మూడు గ్రాడుయేట్‌, రెండు ఉపాధ్యాయ, నాలుగు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. బ్యాలెట్‌ విధానంలో జరిగిన ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు జరిగింది.