జ‌న‌వ‌రి 31 నుంచి పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాలు

Parliament

న్యూఢిల్లీ : లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు ముందు చివ‌రిసారిగా పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాలు ఈనెల 31 నుంచి ఫిబ్ర‌వ‌రి 9 వ‌ర‌కూ జ‌ర‌గ‌నున్నాయి. ఈ స‌మావేశాల్లో ఆర్ధిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఫిబ్ర‌వ‌రి 1న మ‌ధ్యంత‌ర బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. 31న బ‌డ్జెట్ స‌మావేశాల ప్రారంభానికి ముందు పార్ల‌మెంట్ ఉభ‌యస‌భ‌ల‌ను ఉద్దేశించి రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ప్ర‌సంగిస్తారు. మ‌ధ్యంత‌ర బ‌డ్జెట్‌లో మ‌హిళా రైతుల‌కు ప్ర‌ధాన‌మంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి కింద ఇచ్చే న‌గ‌దు సాయాన్ని రెట్టింపు చేస్తార‌ని భావిస్తున్నారు.

ఇక ఏప్రిల్‌, మేలో లోక్‌స‌భ ఎన్నిక‌లు రానుండ‌టంతో బ‌డ్జెట్ స‌మావేశాల్లో కేంద్రం ఏమైనా కీల‌క ప్ర‌క‌ట‌న‌లు చేస్తుందా అనే ఉత్కంఠ నెల‌కొంది.ఇక బ‌డ్జెట్ స‌మావేశాల అనంత‌రం ఏ క్ష‌ణ‌మైనా లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు ఈసీ షెడ్యూల్‌ను ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.