కోనసీమ ఘటన పట్ల వైస్సార్సీపీ సర్కార్ కు రఘురామ రాజు సలహా

MP Raghurama krishna Raju
MP Raghurama krishna Raju

కోససీమ జిల్లా పేరును అంబేద్కర్ జిల్లాగా మార్చడం ఫై అమలాపురంలో మంగళవారం కోనసీమ సాధన సమితి ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. వందలాది మంది అమలాపురంలోని గడియారం స్తంభం సెంటర్, ముమ్మిడివరం గేట్ తదితర ప్రాంతాల్లో ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో ప్రభుత్వ వాహనాలతో పాటు, పలు ప్రవైట్ వాహనాలు దగ్దమయ్యాయి. దీంతో ప్రస్తుతం పోలీసులు 144 సెక్షన్ ను అమలు చేసారు. కాగా ఈ ఘటన పట్ల వైస్సార్సీపీ ఎంపీ రఘురామ రాజు ప్రభుత్వానికి సలహా ఇచ్చారు.

గతంలో జిల్లాల పేర్ల మీద గతంలో వివాదాలు, చర్చలు జరిగినప్పుడు ఓ పద్దతిని అందరూ అనుసరించారని గుర్తు చేశారు. చాలా చోట్ల అక్కడి ప్రజాభిప్రాయం తీసుకున్నారుని.. అలాంటప్పుడు కోనసీమపై వచ్చిన ప్రజాభిప్రాయం ఏమిటని ప్రశ్నించారు. ప్రజాభిప్రాయం అప్పుడే ఇలా ఉంటే.. ఆ సమయంలోనే ఇలా ఎందుకు పేరు పెట్టలేదని ప్రశ్నించారు. అంబేద్కర్‌ను అభిమానించని వ్యక్తి ఏ కులంలోనూ ఉండరని వ్యాఖ్యానించిన ఆయన.. అన్ని కులాలు ఆరాధించే వ్యక్తి అంబేద్కర్‌ అన్నారు.

ప్రజాస్వామ్యంలో మెజార్టీ ప్రజల నిర్ణయాన్ని గౌరవించాలన్నారు ఎంపీ. ఎక్కువ మంది కోరుకున్న వ్యక్తే ముఖ్యమంత్రి అయినప్పుడు.. ఎక్కువ మంది కోరిక మేరకు కోనసీమ జిల్లా పేరుపై నిర్ణయం తీసుకోవాలని సలహా ఇచ్చారు. సీఎం జగన్‌ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ సమర్థిస్తున్నారా? లేక వ్యతిరేకిస్తున్నారా? అని ప్రజాభిప్రాయం సేకరించాలని సలహా ఇచ్చారు. నిజంగా జనం ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి అమలాపురం మొత్తం కాకపోయినా లాటరీలో కొన్ని ప్రాంతాలను ప్రజల ముందు నిర్ణయించాలని సూచిస్తున్నారు.

అభిప్రాయాలు తెలుసుకోవాలని భావిస్తున్న ప్రాంతాల్లో కనీసం లక్షకు తక్కువ కాకుండా ఓటింగ్‌ పెట్టాలంటున్నారు రఘురామ. మళ్లీ ఈవీఎంలు వద్దని.. వాటిపై జనాలకు ఈ మధ్య నమ్మకం పోతోందన్నారు. అందుకే బ్యాలెట్‌ విధానంలోనే ఓటింగ్‌కు వెళ్లాలని.. పెద్ద కష్టం కాదనుకుంటే జిల్లా మొత్తం ఓటింగ్‌ పెట్టొచ్చన్నారు. ఆ ఓటింగ్‌లో జిల్లా వ్యవహారంపై ఓ క్లారిటీ వస్తుందన్నారు.