సినిమా చూస్తుండగా బ్రెయిన్‌ స్ట్రోక్ తో అఖండ ఎగ్జిబిటర్‌ మృతి

Akhanda Trailer-
Akhanda Trailer-

అఖండ ..అఖండ ..అఖండ ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ పేరే మారుమోగిపోతుంది. నందమూరి బాలయ్య – బోయపాటి కలయికలో వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ సాధించడమే కాదు కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. రెండో రోజుల్లోనే నలభై కోట్ల గ్రాస్‌ను కొల్లగొట్టేసి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. వీకెండ్‌లో ఈజీగా బ్రేక్ ఈవెన్ అయిపోతాడంటూ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ తరుణంలో ఓ విషాదం నందమూరి అభిమానులను షాక్ కు గురి చేస్తుంది.

తూర్పుగోదావరి జిల్లా సినీ ఎగ్జిబ్యూటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, ప్రముఖ సినీ ఎగ్జిబిటర్‌ అయిన జాస్తి రామకృష్ణ శ్యామల థియేటర్‌లో ‘అఖండ’ సినిమా వీక్షిస్తుండగానే బ్రెయిన్‌ స్ట్రోక్ కు గురయ్యి ప్రాణాలు విడిచారు. అయితే వెంటనే హాస్పిటల్‌కు తరలించినప్పటికీ లాభం లేకుండా పోయింది. అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయారు. రాజమండ్రి సమీపంలో ఉన్న నామవరం వీఎస్‌ మహల్‌ థియేటర్‌ ఓనర్‌గా కెరీర్‌ను ప్రారంభించి అటు తర్వా జిల్లా సినీ ఎగ్జిబ్యూటర్స్‌ అసో సియేషన్‌ అధ్యక్షుడిగా, వింటేజ్‌ క్రియేషన్స్‌ అధినేతగా రామకృష్ణ ఎదిగారు. ఈ విషయం తెలిసి నందమూరి అభిమానులు షాక్ కు గురయ్యారు.