పరీక్షిత్‌ మహారాజు

Praikshit Maharaj

గంగానదీ తీరాన ప్రాయోపవేశము చేస్తున్న పరీక్షిన్మహారాజు వద్దకు పదహారు సంవత్సరాల వయస్సు గల శుకమహర్షి వచ్చాడు. పరీక్షిన్మహారాజు ఎదురేగి నమస్కరించాడు. ఓ అవధూతోత్తమా! ‘కరుణతోడ చెప్పవే తండ్రి ముక్తికి చేరు తరువు, అని అడిగాడు. ఇక్కడ మనము గమనించవలసిన విషయం ఉంది. ఆ రాజుకు ఏడు రోజులలోపల పాము కరచి చస్తాడనే శాపం ఉంది. అయినా ఆయన పాముకాటు నుంచి తప్పించుకునే మార్గము చెప్పమని అడగలేదు. లేదా పాము కరచినా ప్రాణాపాయం నుంచి బయటపడే మార్గము సూచించమని అడగలేదు. అప్పటికే అక్కడ ఎందరెందరో రుషీశ్వరులున్నారు. వారినీ అడగలేదు, వారూ దాన్ని గురించి ప్రస్తావించలేదు. అదే ఈనాడు ఎవరైనా అలాంటి స్థితిలో ఉంటే పాము దగ్గరకు రాకుండా ఉండాలంటే ఏమి చేయాలి? ఒకవేళ వచ్చి కాటువేస్తే ఏ మందును వాడాలి, ఎలా ప్రాణాన్ని నిలబెట్టుకోవాలి? అని అడిగేవారు.
ముంబయికిపో, చెన్నైకి పో, దుబా§్‌ుకి పో అని చెప్పేవాళ్లు కొందరు. ఈ ఆస్పత్రికి పో, ఆ డాక్టర్‌ను కలువు అని చెప్పే వాళ్లు కొందరు ఉంటారు. లేదా నీకేమీ భయం లేదు, నేను నీకొక తాయెత్తు ఇస్తా, యంత్రమిస్తా, మంత్రమేస్తా అనేటోళ్లు కొందరు, మృత్యుంజయ జపం చె§్‌ు, ఈ హోమం చె§్‌ు, ఆ యాగం చె§్‌ు అని చెప్పేటోళ్లు కొందరు ఉంటారు. అలాంటివేవీ జరగినట్లు మనం ఎంతో భక్తి, శ్రద్ధలతో పఠించే భాగవతములో కనపడవు. పాము కాటువల్ల వచ్చే చావును ఆనందంగా ఆహ్వానిస్తాడు పరీక్షీన్మహారాజు. మోక్షాన్ని పొందే మార్గమేది? అని అడుగుతాడేగానీ అపాయం నుంచి తప్పించుకుని జీవించటమెలా? అని అడగడు. శుకమహర్షి స్థానంలో వేరొకరు ఎవరైనా ఉండి ఉంటే ఈ గుడికిపో, ఆ క్షేత్రానికి పో, ఈ నదిలో మునుగు, ఆ నదిలో తేలు, అభిషేకం చేయించు, అర్చన చేయించు అని చెప్పి ఉండేవారే. కానీ శుకమహరి అలాంటివేవీ చెప్పలేదు. ఆయన ఏమి చెప్పాడో చూడండి. ‘ఓ కౌరవేశ్వరా! ఖట్వాంగుడనే రాజర్షి పూర్వము తనకు ఆయుర్దాయము కొద్ది క్షణాలు మాత్రమే అని గ్రహించి వైరాగ్యముతో సర్వమును విడిచి శ్రీహరిని ఆశ్రయించి మోక్షమును పొందాడు. నీకు ఇంకా ఏడు దినములు గడువు ఉంది. నీవు ఆ సమయమును సద్వినియోగం చేసుకొని ఉత్తమ గతులను పొందు అన్నాడు. ‘ఏకాంత ప్రదేశమునకు పోయి, సుఖమైన ఆసనమును ఏర్పాటు చేసుకుని, ఓంకారమును జపించవలెను. ఓంకారము శబ్దరూపమైన పరబ్రహ్మయే. మనసు విషయాస్తులకు నుండి దూరమై సమాధి స్థితిని పొందును. అదియే మహోత్కృష్టమైన మానవ లక్ష్యము అని చెప్పాడు. శుకమహర్షి అక్కడికి ఇక్కడికి బయటికి పరుగులు తీసేది మాని లోపలికి ప్రయాణం చె§్‌ు అని చెప్పాడు. పరీక్షిన్మహారాజుకు దాన్ని గ్రహిస్తే మనం బాగుపడతాం.

  • రాచమడుగు శ్రీనివాసులు

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/