పార్టీలను బట్టి అలంకరణ

సింపుల్ గా ఆభరణాల ఎంపిక

Jewellery

చాలా మందికి లేటెస్ట్‌ మోడల్ నగలు కొనాలని ఉంటుంది. ఏ డ్రెస్‌కు ఏ తరహా నగ బాగుంటుందో చూడాలంటే కొంత కష్టమే. వారాంతం పార్టీలకు హాజరయ్యే వారు వెండి ఇయర్‌రింగ్స్‌ ఎంచుకోవచ్చు.

లేదంటే వెండి పూత వేసిన చిన్న గొలుసు, లాకెట్‌ వేసుకున్నా బాగుంటుంది. హుందాగా కనిపిస్తుంది. సంప్రదాయ వేడుకలకు వెళ్లేటప్పుడు అందంగా, హుందాగా ఉండే దుస్తులే ధరించాలి.

నెక్‌ కొంత విశాలంగా వేసుకునే డ్రెస్‌లు వేసుకుంటే సన్నటి, పొడవు తక్కువ ఉండే హారం ఒకటి వేసుకుంటే సింపులా అయినా అందంగా అనిపిస్తుంది.

ఇక మెహందీ ఫంక్షన్లు, గృహప్రవేశాలకు వెళుతున్నప్పుడు అనార్కలీ డ్రెస్‌లు, చీరలు బాగుంటాయి. వాటి మీదకు ఎనామిల్‌,

కుందన్లతో ముత్యాల నగలు, ఇతర నగలు వేసుకుంటే ఆకట్టుకునేలా ఉంటాయి. సంప్రదాయంగా ఉన్నా సింపుల్‌గా ఉండే దుస్తులు ధరిస్తే కుందన్‌, పచ్చలు, కెంపులూ, ముత్యాల నగలు వేసుకోవాలి. అదే భారీ డిజైన్‌ ఉన్న డ్రెస్‌లు వేసుకున్నప్పుడు నగలు సింపుల్‌గా, తక్కువగా ఉంటే మంచిది.

మెడలో హారం, గొలుసూ, నెక్లెస్‌ ధరించినపుడు చేతులకు బ్రెస్‌లెట్‌ ఉండేలా చూసుకోవాలి. అదే గాజులు ధరిస్తే కొంత తేలిపోయినట్లుగా అనిపిస్తుంది. రాళ్లు, కుందన్లు పొదిగిన బ్రేస్‌లెట్‌ను ఎంచుకోవచ్చు.

సాధారణ లేదంటే ఆధునిక తరహా డ్రెస్‌లు, కుర్తీలు వేసుకున్నప్పుడు ఎనామిల్‌ పూత వేసిన స్టడ్స్‌ చాలా బాగుంటాయి. అలానే డ్రాప్‌ తరహాలో వేలాడే హ్యాంగిగ్స్‌ కూడా నప్పుతాయి.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/